
* ఈసారి ప్రత్యేకత ఏంటంటే..?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాలు (Inter Results) విడుదల అయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) , మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్లో ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఇంటర్ మొదటి , రెండవ సంవత్సరానికి మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే ఈసారి పాస్ పర్సంటేజ్ పెరిగింది. ఫలితాల్లో అమ్మాయిలదే పై చేయి సాధించారు. ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా.. ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం బాలికలు పాస్ అయ్యారని భట్టి విక్రమార్క వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ www.tgbie.cgg.gov.inలో చూసుకోవచ్చునని చెప్పారు. దీంతో పాటు ఈసారి ప్రతీ విద్యార్థి మొబైల్ ఫోన్‌కు కూడా ఫలితాల లింక్ పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చునన్నారు. ఫలితాల నేపథ్యంలో ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య (Krishna Aditya) సోమవారం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) పంపారు. ‘పరీక్షల్లో జయాపజయాలు సహజం. ఫెయిలయ్యారనో, ఆశించిన విధంగా మార్కులు రాలేదనో నిరుత్సాహ పడవద్దు. మరింత శ్రమించండి.. రెట్టింపు పట్టుదలతో పోరాడండి. విజయం మీ బానిస అవుతుంది’ అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని పంపారు.
……………………………………….