
* సీఎం రేవంత్‌ను కోరిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
* గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం
* క్రికెట్ ప్రేమికులకు శుభవార్త
ఆకేరున్యూస్, హనుమకొండ ః వరంగల్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి
స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలే తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారని ఎమ్మెల్యేలు తెలిపారు.వరంగల్‌లో స్పోర్ట్స్ అకాడమీతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని కోరుతూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,రేవూరి ప్రకాశ్ రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డి,అనుమాండ్ల యశస్వినీ రెడ్డి,కే ఆర్ నాగరాజులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. .జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆయనను కలుసుకొని వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ తరువాత తెలంగాణలో రెండో రాజధానిగా పిలువపడుతున్న వరంగల్ నగరంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆవశ్యకతను ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వివరించారు.
విద్యాసంస్థల నిలయం
గత కొన్ని దశాబ్దాలుగా వరంగల్ నగరం ఉత్తర తెలంగాణలో విద్యాసంస్థల నిలయంగా ఉంది. అంతర్జాతాయ గుర్తింపు పొందిన నిట్ కళాశాలతో పాటు కాకతీయ మెడికల్ కాలేజీ,కాకతీయ యూనివర్సిటీ ,కాళోజీ యూనివర్సిటీ, తోపాటు ఇంజినీరింగ్ కాలేజిలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు,ఇంటర్ మీడియట్ కాలేజిల్లో వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కరీంనగర్,ఆదిలాబాద్,ఖమ్మం జిల్లాలనుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తూంటారు. నగర జనాబా 8 లక్షలపైనే ఉంటుంది. ఇంత పెద్ద నగరానికి యువతకు ఇంత వరకూ క్రీడాపరంగా సరైన సదుపాయాలు లేవు. స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పితే స్థానిక యువత కు ఎంతో మేలు జరుగుతుంది.
నగరప్రజల చిరకాల వాంఛ
వరంగల్ లో క్రికెట్ స్టేడియం నిర్మించలనే నగర ప్రజల చిరకాల వాంఛ. ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ వరంగల్ లో నిర్వహించాలని కోరుకుంటున్నారు. విశాఖపట్నం, ధర్మశాల వంటి నగరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. తెలంగాణలోనే రెండో రాజధానిగా పేరు తెచ్చుకున్న వరంగల్ లె మాత్రం ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లేదు. బస్వరాజు సారయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వరంగల్ లోని జక్కులొద్ది ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి కాని అది కార్యరూపం దాల్చలేదు.
అంతర్జాతీయ గుర్తింపు
చారిత్రక నగరంగా వరంగల్ కు గుర్తింపు ఉంది. క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తే వరంగల్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. ఇంటర్నేషనల్ ఆటగాళ్లు కు వరంగల్ నగరంతో పరిచయం ఏర్పడుతుంది.
అధికారులను ఆదేశించిన సీఎం
వరంగల్ లో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో పాటు,స్పోర్ట్స్ అకాడమీని స్థాపించేందుకు విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సీఎంను కలిసిన ఎమ్మెల్యేలే తెలిపారు.అత్యాధుని సదుపాయాలతో స్టేడియం నిర్మాణం జరుగుతుందని వారు తెలిపారు. దీనికి సంబంధించిన భూ సేకరణ, బడ్జెట్ ప్రణాళికలను త్వరలోనే సీఎంకు నివేదిస్తామని వారు వెల్లడించారు.
………………………………………………….