
* సీజేఐపై దాడి దారుణమైన సంకేతం
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని, సుప్రీంకోర్టులో సీజేఐ(CJI) గవాయ్ పై నిన్న జరిగిన దాడి ఒక దారుణమైన సంకేతమని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ B.R. గవాయ్ (B.R. Gavai )పై జరిగిన దాడిని తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయ గౌరవంపై జరిగిన ఈ అవమానకరమైన దాడి కేవలం ఒక వ్యక్తిపైనే కాదు, సంస్థపైనే జరిగిన దాడిగా వర్ణించారు. విశ్వాసం వంటి సున్నితమైన అంశాలపై కూడా ఏ భిన్నాభిప్రాయం హింసను సమర్థించదు. ఇటువంటి ప్రవర్తన ప్రజాస్వామ్య పునాదినే బెదిరిస్తుంది.. అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.
…………………………………………………….