
* సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్ (OPERATION SINDOOR) కొనసాగిస్తున్న భారత్.. పాక్కు తగిన బుద్ధి చెబుతోంది. దాయాదీ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పాక్పై నిరంతరం దాడులను కొనసాగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ధర్మశాల పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, ఈ లీగ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నేేడు జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిలట్స్ మ్యాచ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది
………………………………………..