iQOO Z11 Lite Launch
* రూ.20 వేలలో AI ఫోన్..
* జూలై 24న ఎంట్రీ!
* స్టూడెంట్స్ కోసం iQOO Z11 Lite
* 6500mAh బ్యాటరీ.. AI స్టడీ ఫీచర్లు..
ఆకేరు న్యూస్, డెస్క్:
బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న కాలేజ్ విద్యార్థులకు iQOO శుభవార్త చెప్పింది. iQOO Z11 Lite పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను జూలై 24న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రూ.20 వేల లోపు ధరలో రానున్న ఈ ఫోన్లో AI ఫీచర్లు, భారీ బ్యాటరీ, బలమైన డిజైన్ వంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి.
* రూ.20 వేలలోనే ప్రీమియం ఫీచర్లు
iQOO Z11 Lite ధర సుమారు రూ.20,000 ఉండే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత Amazonతో పాటు iQOO అధికారిక వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. Solar Flame, Midnight Blue అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. వెనుక భాగంలో డైనమిక్ లైట్ డిజైన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
* చదువుకు ఉపయోగపడే AI ఫీచర్లు
ఈ ఫోన్లో AI ఆధారిత ప్రొడక్టివిటీ టూల్స్‌ను అందించారు. పెద్ద డాక్యుమెంట్లను క్షణాల్లో సమ్మరీ చేయడం, టెక్స్ట్ ట్రాన్స్లేషన్, అసైన్మెంట్లకు ఐడియాలు ఇవ్వడం వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే AI Caption ఫీచర్ ద్వారా లైవ్ క్లాసులు లేదా మీటింగ్‌లను రియల్‌టైమ్‌లో ట్రాన్స్క్రైబ్ చేయడంతో పాటు వెంటనే సమ్మరీ కూడా అందిస్తుంది.
* 6500mAh బ్యాటరీ హైలైట్
ఈ ఫోన్లో 6500mAh భారీ బ్యాటరీతో పాటు 44W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకునేలా బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా బ్యాటరీకి 5 సంవత్సరాల హెల్త్ లైఫ్ అందిస్తున్నట్లు వెల్లడించింది.
* పడిపోయినా టెన్షన్ లేదు
విద్యార్థుల రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌కు Military-Grade Durability సర్టిఫికేషన్‌తో పాటు SGS 5-Star Drop Resistance రేటింగ్‌ను ఇచ్చారు. అలాగే 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ డిస్ప్లేతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
