-హుజురాబాద్ అభివృద్ధికి ₹1000 కోట్లు ఇవ్వాలి.
-హుజురాబాద్ నియోజకవర్గంలో 100% రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్ , హుజూరాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు గ్రామాల వరకు సాగునీరు అందించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో దండం పెట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…. డిబిఎం21, డిబిఎం22,డిబిఎం23,డిబిఎం24 కాలువల ద్వారా నియోజకవర్గంలోని కమలాపూర్ మండలానికి చెందిన,అంబాల, శ్రీరాములపల్లి, శనిగరం, గూనిపర్తి, మాదన్నపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్ గ్రామాల్లో వేల ఎకరాల్లో పంటలు ఎండి పోతున్నాయని వెంటనే ఆ గ్రామాలకు నీరు ఇచ్చి ఆదుకోవాలని దండం పెట్టి వేడుకుంటున్నానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. డీబీఎం29 ఎల్ లో కూడా జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలకు నీరు అందట్లేదని వెంటనే నీరు అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నానని అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ద్వారా జమ్మికుంట,వీణవంక మండలాల్లో 6 నుంచి 7వేల వరకు ఆయకట్టుకు నీరు అందుతుందని, నీటిపారుదల శాఖ మంత్రి కి రిప్రజెంటేషన్ ఇచ్చానని, పోయిన అసెంబ్లీలో నిర్మాణం చేపట్టాలని ప్రస్తావించినప్పటికి ఇప్పటివరకు కల్వల ప్రాజెక్టుపై ఎలాంటి రిప్లై కూడా లేదన్నారు.
హుజురాబాద్ అభివృద్ధికి 1000 కోట్లు ఇవ్వాలి
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ కు 800 కోట్లు ఇచ్చారని, అదేవిధంగా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు 1000 కోట్లు ఇవ్వాలని ఇది కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మనసులో ఉన్న మాటని కౌశిక్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
హుజురాబాద్ నియోజకవర్గంలోని 107 గ్రామపంచాయతీలల్లోని ఏదేని ఒక్క గ్రామపంచాయతీలోనైనా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు.
…………………………………
