* రాష్ట్ర ఇమేజ్ పెంచడానికే ఈ కార్ రేస్
* దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr)పై కేసు నమోదు చేయడం.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దీనిపై ఆ పార్టీ నేతలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao)ఖండించారు. రాష్ట్రం కోసం పనిచేస్తే కేసులు పెడుతున్నారని, రాష్ట్ర ఇమేజ్ పెంచడానికే ఈ-కార్ రేస్ నిర్వహించామని ఆయన తెలిపారు. కేటీఆర్‌పై అన్యాయంగా ఎఫ్ ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ కార్ రేస్, కేటీఆర్ పై నమోదు చేసిన కేసులపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
……………………………………………..