
* ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు
ఆకేరు న్యూస్, డెస్క్ : పార్టీ మారిన ఎమ్మెల్యెల అనర్హత పిటిషిన్పై సుప్రీంకోర్టు(Supreme court)లో ఈరోజు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుందరం (Sunderam) వాదనలు వినిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్(Speaker) స్పందించలేదని అన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున లోక్‌సభలో పోటీ చేసి ఓడారని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత కూడా బీఆర్ ఎస్‌లోనే ఉన్నామంటున్నారని సుందరం వాదనలు వినిపించారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని ఆదేశించారని, అయినా స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదన్నారు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత నోటీసులు ఇచ్చారన్నారు. 3 వారాల్లో రిప్లయ్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారని, ఫిబ్రవరి 13న నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికి 3 వారాయ్యాయి.. నోటీసులు ఎటువెళ్లాయో తెలియదన్నారు. మేం ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ చేయలేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని, జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice Gavay) ధర్మాసనం పేర్కొంది. ఎప్పటిలోగా తీర్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని, అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలం అని పేర్కొంది.
………………………………