* పదాధికారుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (MLA Katipally Venkataramana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సమావేశాలకు రావడం.. వెళ్లడమే తమ ఎమ్మెల్యేల పనా అని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసులు కూర్చుని కార్యక్రమం డిసైడ్ చేస్తారు కానీ, క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమమే ఉండదని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అంతగా బాగాలేదని వెల్లడించారు. ఎంపీ(mps)లు, ఎమ్మెల్యేల (mlas) మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు లేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే, జిల్లాల్లో పార్టీ నేతల తీరుపై ఎమ్మెల్యే కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఓ కమిటీ వేద్దామని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నట్లు తెలిసింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. 15 జడ్పీ స్థానాలతో పాటు, ఎమ్మెల్యే స్థానంలో బీజేపీ విజయం సాధించేలా చూడాలని నేతలకు రామచంద్రరావు (Ramchandra rao)దిశా నిర్దేశం చేశారు.
…………………………………………………..
