* మాధవరెడ్డికి ఆ పార్టీ టికెట్ ఎలా ఇస్తుంది
* కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు
* తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి బీఆర్ ఎస్ టికెట్ ఎలా ఇస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీలకు బీఆర్ ఎస్ అనుకూలమా.. కాదా.. అని చెప్పాలన్ఆనరు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు నిధులు కేటాయించి అమలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీతదాటి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చిరిపివేస్తు చెరిగిపోయేది కాదని కవిత తెలిపారు.
…………………………………..
