
* హైదరాబాద్‌కు వచ్చే ముందు కుమార్తెతో ఏం మాట్లాడారు?
* భర్తను విచారిస్తున్న పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గాయని కల్పన ఆత్మహత్యయత్నం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. పాటలు పాడే సమయంలో హుషారుగా కనిపించే కల్పన మానసికంగా దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తోంది. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఆమెను మంగళవారం రాత్రి కేపీహెచ్‌బీ (KPHB)లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్పించిన కల్పనకు (Singer Kalpana) చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రే సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కల్పన భర్త ప్రసాద్ చెన్నైలో ఉంటుండటంతో నిజాంపేట్‌లోని ఇంట్లో ఒంటరిగా ఉంటుందామె. ఆత్మహత్య ఘటన నేపథ్యంలో కల్పన భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ రోడ్ వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్‌లో కల్పన నివాసం ఉంటున్నారు. నిన్న కేరళ నుంచి కల్పన హైదరాబాద్‌కి వచ్చినట్లు తెలుస్తుంది. ఎక్కువగా కేరళతో పాటు చెన్నైలో ఉండే కల్పన హైదరాబాద్‌కి చాలా రోజుల తర్వాత వచ్చినట్లు సమాచారం. అయితే మంగళవారం ఉదయం హైదరాబాద్‌కి వచ్చిన కల్పన ఆమె పెద్ద కూతురుతో మాట్లాడిన తర్వాత ఆమెను కేరళ నుంచి హైదరాబాద్‌కి రమ్మని చెప్పినట్లు సమాచారం. అయితే దీనికి ఆమె కూతురు ఒప్పుకోకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిన కల్పన ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిద్రమాత్రలు ఎక్కువ సంఖ్యలో మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అధికారిక వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
……………………………….