
* కొనసాగుతున్న ఇజ్రాయిల్ ,ఇరాన్ యుద్ధం
* రెండు దేశాల్లోనూ ఉన్న ప్రవాస భారతీయులు
* ఇప్పటికే ఇరాన్ నుంచి ఇంటి ముఖం పట్టిన భారతీయులు
* ఇజ్రాయిల్ లో 18 వేల మంది భారతీయులు
* కొనసాగుతున్న ఆపరేషన్ సింధు
* భారతీయులను స్వదేశం తీసుకొచ్చే యత్నం
ఆకేరు న్యూస్ డెస్క్ ః ఇజ్రాయిల్, ఇరాన్ ల మధ్య యుద్ధం భీకరంగా మారింది. దానికి తోడు అమెరికా కూడా ఇజ్రాయిల్ కు తోడైంది. ఈ నేపధ్యంలో ఉపాధి కోసం వెళ్లి ఈ రెండు దేశాల్లో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బతికుంటే బలుసాకు అయినా తిని బతకొచ్చు అని భీరతీయులు ఇంటి ముఖం పడుతున్నారు. ఇరాన్ లో ఉన్న భారతీయులను స్వదేశం రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు ను స్టార్ట్ చేసింది. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులు ఇండియాకు చేరుకుంటున్నారు. ఇప్పడు ఆపరేషన్ సింధు ద్వారా ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్రించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉంది.స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపిందిముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు భారత్ అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపింది. భారత్ చేరుకోవాలనుకునే వారు టెల్ అవివ్‌లోని రాయబార కార్యాలయంలో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలని ఎంఈఏ సూచించింది.
…………………………………………………