* రాజేంద్రనగర్ లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లో ఒకవైపు ఐటీ అధికారుల దాడులు.. మరోవైపు పోలీసు అధికారుల సోదాలతో ఈరోజు ఉదయం నుంచీ వాతావరణం వేడెక్కింది. ప్రముఖ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పిస్తా హౌస్, షా గౌస్ కార్యాలయాల్లో ఈ సోదాలను ఉదయం నుంచి సోదాలను నిర్వహిస్తున్నారు. మొత్తం పదిహేను బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అయిన పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్ల యాజమాన్యాలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించకపోవడంతో… ఆదాయం అధికంగా వస్తున్నా పన్ను చెల్లింపు సక్రమంగా జరపడం లేదన్న ఫిర్యాదు మేరకు ఆదాయపు పన్ను అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రమూలాల నేపథ్యంలో రాజేంద్రనగర్ లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పీ అండ్ టీ కాలనీలో తనిఖీలు నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలో ఏకంగా 150 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొనడంతో స్థానికంగా ఆందోళన వాతావరణం ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న నైజీరియన్ల వీసాలను పరిశీలిస్తున్నారు.
…………………………………………….
