
* ఎమ్మెల్సీ కవిత
* బీఆర్ఎస్ రజతోత్సవ సభపై పాట ఆవిష్కరణ
ఆకేరున్యూస్, వరంగల్: టిఆర్ఎస్ పార్టీగా ప్రజల ముందుకు వచ్చి మన్ననలు పొంది దేశానికి సేవాలందించి బిఆర్ఎస్గా రూపాంతరం చెందామని, పరిణితి చెందడం అనేది ప్రకృతి ధర్మమని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి రూపొంచించిన ‘‘ఎగిసెర బలే ఎగిసెర సారే రావాలంటూ ఓరుగల్లు పిలిచెర’’ అనే పాట, రిటైర్డ్ ఎమ్మార్వో మహమ్మద్ సిరాజుద్దీన్ రచించిన మరో పాటను గురువారం పద్మ శ్రీ గడ్డం సమ్మయ్యతో కలిసి కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, గాయకులు మానుకోట ప్రసాద్, జాగృతి రాష్ట్ర నాయకులు దాస్యం విజయ్ భాస్కర్, రజినీసాయిచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎంతోమంది ఉద్యమ నాయకులు ఓరుగల్లు గడ్డపై నుండే ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉండదు. ఓరుగల్లు గడ్డ మీద నుండి ఆ మహనీయుడిని తలుచుకోవడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ భావజాలాన్ని బతికించి అందిస్తే ఆయన ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ కొనసాగించి రాష్ట్రాన్ని తెచ్చారని అన్నారు. 14 ఏళ్ల పోరాటంలో, 10 ఏళ్ల పాలనలో మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని విలసిల్లచేసి, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా నిలబెట్టారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదివరకు మనం మన తెలంగాణ యాసలో మాట్లాడితే హేళనగా చూసేవాళ్ళు, కానీ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల స్వపరిపాలనలో మన యాసకు భాషకు ప్రాభవం పెరిగిందన్నారు. 2001లో కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత మన యాసను సగర్వంగా మైకుల ముందు మాట్లాడే పరిస్థితి వచ్చిందని సూచించారు. గత 25 ఏళ్లలో దేశంలో రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే మనుగడలో ఉన్నయని, అందులో ఒకటి టీడీపీ, ఇంకోటి బీఆర్ఎస్. అలాంటి ఉద్యమ పార్టీ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని, మహా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. . ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ… పాట తెలంగాణ ప్రజల ప్రాణం పేద ప్రజల పేగు బంధం పాట అని కొనియాడారు.
………………………………………………….