
* డీఎస్ ఆర్ గ్రూపు డైరెక్టర్ ఇళ్లలో కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు ఈరోజు ఉదయాన్నే సోదాలు నిర్వహించారు. ఫిలింనగర్ లోని డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ (DSR GROUP CONSTRUCTIONS) తో కలిపి ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంతో ఆయన ఇంట్లో కూడా అధికారులు పరిశీలన జరిపారు. కొన్ని సంవత్సరాలుగా డీఎస్ఆర్ గ్రూప్‌తో రంజిత్ రెడ్డి కలిసి పని చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు చెన్నయ్, బెంగళూరు సహా 20కి పైగా ప్రాంతాలలో అధికారులు సోదాలు జరిపారు. డీఎస్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీతో పాటు కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. కంపెనీ టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచార మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. డీఎస్ ఆర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎస్ ఆర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కంపెనీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు (IT RIDES) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల పన్నుల చెల్లింపులపై కంపెనీ యాజమాన్యాన్ని ఆరా తీస్తున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, ఎస్ ఆర్‌నగర్, సురారంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ కంపెనీతో కలిసి పని చేస్తున్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి (RANJITHREDDY) ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
………………………………….