
* లాల్ దర్వాజా బోనాల్లో ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఆదివారం ఆమె హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వర్షాలు బాగా పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అంతకు ముందు కవిత కార్వాన్ లోని దర్బార్ మైసమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.హరిబౌలి లోని అక్కన్న మాదన్న మహంకాలి ఆలయంలో బోనం సమర్పించారు.
………………………………………..