
* గ్రానైట్ లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా..
* గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరి మృతి
ఆకేరు న్యూస్, ఖమ్మం : గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం టైర్లు పంక్చర్ కావడంతో వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న వారిపై గ్రానైట్ రాళ్లు పడడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని (Khammam) ముదిగొండలో శుక్రవారం ఉదయం జరిగింది. ముదిగొండ సమీపంలో ఖమ్మం-కోదాడ జాతీయరహదారిపై గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుతప్పిన వాహనం బోల్తాపడింది. ఈ క్రమంలో అందులో ఉన్నవారు రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయారు. వారిపై గ్రానైట్ బండలు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి(Died)చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
…………………………………………