
ఆకేరు న్యూస్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ నుండి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళా ఖాతం( BAY OF BENGAL) లోఆవర్తనాలు ద్రోణుల ప్రభావంతో రెండు రాష్రాల్లోనిపలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా,మహబూబ్ నగర్ ,జోగులాంబ గద్వాల,వనపర్తి,నాగర్ కర్నూల్,నారాయణపేట,నిర్మల్,కొమురం భీం,నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.అలాగే ఏపీలో అనంతపురం, సత్యసాయి,కడప అన్నమయ్య,పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
……………………………………………