
తెలుగు రాష్ట్రాల్లో.. మరో 5 రోజుల పాటు వర్షాలు.
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని శ్రీకాకుళం (srikakulam), విజయనగరం(vijayanagaram),విశాఖఫట్నం( vishakapatnam),అనకాపల్లి (anakapally) కాకినాడ (kakinada) జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మిగతా జిల్లాల్లో చెదురుమొదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణ లో ఓ మోస్తరుగా వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి,మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కృష్ణా ,గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన సంగతి తెల్సిందే ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్లవిద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో రెండు రాష్ట్రాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
………………………………..