* శ్రీకాకుళం తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు స్పందన
ఆకేరు న్యూస్ డెస్క్ : శ్రీకాకుళం కాశిబగ్గ ఆలయంలో జరిగిన ఘటన తనను కలచి వేసిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొనారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు.ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక రోజుల్లో పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలి : పవన్ కల్యాణ్
శ్రీకాకుళం కాశిబుగ్గ ఆలయంలో జరిగినఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. క్యూలైన్లలో నిలుచున్న భక్తులు మరణించడం భాదాకరమన్నారు. మృతుల్లో చిన్నారి ఉండడం తనను కలచివేసిందన్నారు. ఆధ్యాత్మికంగా ప్రత్యేకత ఉన్న రోజుల్లో ఆలయాల వద్ద ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి అని అన్నారు. కాశిబుగ్గ ఆలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తోందని ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
రెయిలింగ్ కూలడంతో జరిగింది : హోం మంత్రి అనిత
కాశిబుగ్గ ఆలయ దుర్ఘటన చాలా బాధాకరమని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. మొదటి అంతస్తులో ఉన్న రెయిలింగ్ కూలడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
………………………………………………
