
* ట్రాన్స్ ఫార్మర్ వద్ద మూత్రం పోస్తూ విద్యుదాఘాతానికి గురి
* అక్కడిక్కడే ఓ వ్యక్తి మృతి
* సూర్యపేటలో చోటుచేసుకున్న విషాదం
ఆకేరున్యూస్ డెస్క్: వర్షాలు దంచికొడుతున్న నేపధ్యంలో ఈ మధ్య కాలంలో కరెంట్ షాక్ కు గురై మరణిస్తున్న సంఘటనలు ఎక్కవవయ్యాయి. రామాంతాపూర్ లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రథం లాగుతూ హైటెన్షన్ వైర్లకు రథం తగలగా ఆరుగురు మృతి చెంది పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాత బస్తీలో ని బండ్లగూడలో వినాయకుని విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్ తో ఇద్దరు మృత్యువాత పడ్డారు . తాజాగా సూర్యపేటలో ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ వద్ద మూత్రం పోస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యపేట పట్టణంలో ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద వరదనీరు వచ్చి చేరింది. ఇది గమనించకుండా యధాలాపంగా చక్రధర్ (50) అనే వ్యక్తి (Man urinated at transformer) అక్కడ మూత్రం పోశాడు. దీంతో అతడు విద్యుత్ షాక్కు (Electric shock) గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. గిలగిలా కొట్టుకుంటున్న అతన్ని చూసిన స్థానికులు.. పరుగెత్తుకుంటూ వచ్చి విద్యుత్ నిలిపేశారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, చెట్ల వద్దకు వెళ్లకూడాడని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి వెళ్లాల్సి వచ్చిన సందర్భాల్లో ఎలాంటి వస్తువులను ముట్టుకోకుండా, ఇలాంటి వస్తువులకు దూరంగా ఉండాలని చెబుతన్నారు. చక్రధర్ మృతితో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
……………………………………