
* జాగృతి అధ్యక్షురాలు కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీసీ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో 18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో బీసీల బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలపాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. అయితే, ఆర్. కృష్ణయ్య లేఖపై స్పందించారు కవిత.
………………………………