
* 9 చోట్ల మెరుపుదాడులు..
* 25 నిమిషాల్లో 21 లక్ష్యాలపై భారత్ దాడి..
* పాక్లో వణుకు.. కాళ్లబేరానికి ఆ దేశ రక్షణ శాఖ
ఆకేరు న్యూస్, డెస్క్ : నాడు దాడి జరిటిన తర్వాత బిహార్ లో జరిగిన ఓ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాలను మట్టిలో కలిపే సమయం వచ్చిందని హెచ్చరించారు. చెప్పినట్లుగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ముగ్గురు కీలక నేతలు హతమైనట్లు తెలుస్తోంది. ఈదాడులతో భారత్ – పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పెహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు సైనికాధికారులు ప్రకటించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాది స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. భారత్ చర్యలతో జైహింద్.. అంటూ దేశమంతా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తోంది.
25 నిమిషాల్లో 21 లక్ష్యాలపై భారత్ దాడి..
ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం అందించామని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. పాకిస్తాన్ పై తెల్లవారుజామున 1:05 గంటలకు దాడి జరిగిందని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్లో 9 చోట్ల దాడి జరిగింది. ఈ ఆపరేషన్ అర్థరాత్రి 1.05 నుంచి 1.30 వరకు కొనసాగింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా లక్ష్యంపై దాడి జరిగింది. ఉగ్రవాద దాడి కుట్రదారులపై దాడి జరిగింది. పాకిస్తాన్, పీఓకే రెండింటిపైనా దాడులు జరిగాయి. మేం పౌరులకు హాని చేయలేదు. ముందుగా, సవాయి నాలా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. మేం జైషే, లష్కర్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాం. 9 చోట్ల 21 లక్ష్యాలపై దాడి జరిగింది. పాకిస్తాన్లోని సియాల్కోట్లో దాడి జరిగింది. ఇక్కడి సర్జల్ శిబిరంపై దాడి జరిగింది, ఇక్కడే ఒక హిజ్బుల్ శిబిరం ఉండేది. భారత్ చర్యలతో పాక్లో వణుకు మొదలైంది. ఆ దేశ రక్షణ శాఖ అధికారి కాళ్లబేరానికి వస్తున్నట్లుగా మాట్లాడారు. భారత్ దాడులు ఆపేస్తే.. తాము ప్రతీకార దాడులకు దిగబోమని తెలిపారు.
………………………………………………..