* మరొకరికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగాం జిల్లా చిల్పూర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో గుగులోత్ కమలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా గుగులోత్ దాసు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే… జనగాం జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద తండాకి చెందిన గుగులోతు దాసు అతని భార్య దేవరుప్పుల నుండి హన్మకొండకు బైక్ పైన వెళుతున్నారు. ఈ క్రమంలో ధర్మసాగరం మండలం కరుణాపురం వద్ద ముందు వెళుతున్న బైకును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుగులోతు దాసు తలకు, చేతులకు బలమైన గాయాలు కాగా అతని భార్య గుగులోతు కమలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. వారిని 108 స్టేషన్ ఘన్ పూర్ అంబులెన్స్ సిబ్బంది ఇఎంటి హరికృష్, పైలెట్ రాజన్న చికిత్స అందిస్తూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆసుపత్రికి తరలించారు.
