* నర్మెట లో భయం.. భయం
ఆకేరు న్యూస్ , జనగాం : జిల్లాలో పెద్ద పులి భయం వెంటాడుతోంది. నర్మెట మండలం అమ్మా పురంలో రెండు దూడలను చంపినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పాద ముద్రలను గుర్తించి పెద్ద పులి అని ధృవీకరించారు. దాని అడుగు జాడల ఆన వాళ్ళ ఆధారంగా జాడ కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా పెద్ద పులి నర్మెట మండలం నుంచి సిద్ది పేట జిల్లాలోకి ప్రవేశించినట్లు గా అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా పెద్ద పులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
—————————————
