ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు (JEE Advanced Results) ఈరోజు విడుదల అయ్యాయి. ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు టాప్‌లో నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా టాపర్‌గా వంగాల అజయ్‌రెడ్డి, ఓబీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్‌గా డీ. జ్ఞాన రుత్విక్ సాయి నిలిచారు. ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థి రజిత్ గుప్తా 332 మార్కులతో ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్ విద్యార్థి దేవదత్ మాజీ ఆలిండియా మహిళా టాపర్‌గా నిలిచారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థి అర్నవ్ సింగ్ 319 మార్కులతో ఆలిండియా 9వ ర్యాంకుతో పాటు హైదరాబాద్ జోన్ టాపర్‌గా నిలిచాడు. ఇదే జోన్ విద్యార్థి వడ్లమూడి లోకేష్ 317 మార్కులలో ఆలిండియా 10వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. అనిరుద్‌రెడ్డి ఆలిండియా 20, కే రసజ్ఞ హైదరాబాద్ జోన్ (Hyderaba Zone) మహిళా టాపర్తోపాటు, ఆలిండియా 78వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. కాగా, ఈ సారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.87లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1. 80లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 54,378 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో అబ్బాయిలే అధికంగా ఉన్నారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి రికార్డుస్థాయిలో విద్యార్థులు క్వాలిఫై కావడం హాట్ టాపిక్ గా మారింది.
…………………………………………….
