
* ఆ బాధ మాత్రం ఉంది : జీవన్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevanreddy) పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ ఎస్‌లో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. గతంలోనూ ఆయన బహిరంగంగానే పార్టీలోని కొందరు నేతల తీరుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ (Congress)పార్టీకి.. మీకు ఓ దండం అని కూడా అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి జీవన్ రెడ్డి వార్తల్లో నిలిచారు. దీనిపై ఆయన స్పందించారు. పార్టీ మారుతున్నారనే ఊహాగానాలను కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొట్టిపారేశారు. జిల్లాలో దశాబ్దం పాటు ఒంటరిగా పోరాటం చేశానని తెలిపారు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా.. పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డానని వివరించారు. పార్టీలో వి.హనుమంతరావు తర్వాత తానే సీనియర్ నని వెల్లడించారు. జానారెడ్డి (Janareddy) కూడా తన కంటే నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చారని వెల్లడించారు. పార్టీలో సీనియార్టీకి తన పాత్ర ఏంటనే బాధ మాత్రం ఉందని స్పష్టం చేశారు. కొందరు సీనియర్లు వారి వారి అభిప్రాయాలతో మాట్లాడి ఉండొచ్చని, తాను మాత్రం పార్టీని వీడేది లేదన్నారు.
……………………………………………