
* పీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియామకం
* ఝాన్సీ రాణితో పాటు లకావత్ ధన్వంతి నియామకం
* పాలకుర్తి ప్రాంతం నుంచి ఇద్దరు మహిళలకు చోటు
ఆకేరు న్యూస్, పాలకుర్తి :ఎట్టకేలకు ఝాన్సీరెడ్డికి తగిన గుర్తింపు లభించింది. ఎమ్మెల్యే అవుదామనుకున్న ఝాన్సీరెడ్డికి పార్టీ పదవి లభించింది. తెలంగాణ పీసీసీలో 96 మంది నేతలకు పదవులు కేటాయిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. 86 మందిలో 27 మంది ఉపాధ్యక్షులు 69 మంది కార్యదర్శుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది.. ఏఐసీసీ ప్రకటించిన ఉపాధ్యక్షుల జాబిదాల్లో పాలకుర్తికి చెందిన ఇద్దరు మహిళలు ఉపాధ్యక్షులుగా చోటు లభించడం గమనార్హం. నిజానికి ఝాన్సీరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దాదాపుగా ఖరారు అయింది. అయితే ఆమె ఎన్నారై కావడం వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆమెకు ఎమ్మెల్యే టికెట్‌ను పార్టీ కేటాయించలేకపోయింది. అయితే ఝాన్సీరెడ్డి మీద ఉన్న నమ్మకంతో పార్టీ అధిష్టానం ఝాన్సీరెడ్డి కోడలు యశస్వినీ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది.. యశస్వినీ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై గెలిచిన విషయం తెల్సిందే. రాజకీయాల్లో కాకలు తీరి ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న ఎర్రబెల్ల ఓటమి ఎనుక ఝాన్సీరెడ్డి కృషి ఉన్నదని పార్టీ అధిష్టానం గుర్తించింది. పీసీసీ కార్యవర్గంలో ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో ఝాన్సీ రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాలకుర్తి నియోజకవర్గంకు పిసిసిలో సముచిత స్థానం కల్పించడం ఇదే మొదటిసారి. గతంలో పిసిసి మెంబర్లుగా, కార్యదర్శులుగా, అధికార ప్రతినిధులుగా నియామకమయ్యారు తప్పితే ఉపాధ్యక్షులుగా ఎవ్వరూ పనిచేయలేదు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ దుగ్యాల శ్రీనివాసరావు పిసిసి అధికార ప్రతినిధిగా పనిచేశారు. రాయపర్తికి చెందిన బిల్లా సుధీర్ రెడ్డి పిసిసి సంయుక్త కార్యదర్శిగా గతంలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పిసిసి ఉపాధ్యక్షులుగా ఇద్దరికి స్థానం కల్పించడం విశేషం. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి, కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గం కాల్ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, ఉపాధ్యక్షులుగా అధిష్టానం నియమించింది. లకావత్ ధన్వంతి ది పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామం. ఝాన్సీరెడ్డిది తొర్రూరు మండలం చెర్లపాలెం. , లకావత్ ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ప్రస్తుతం పీసీసీ మెంబర్ గా ఉన్నారు. ఏదేమైనా ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరిక పిసిసి ఉపాధ్యక్ష పదవులు వరించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
…………………………………………….