
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ నిట్లో (Warangal NIT)56 ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన వారి కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రేపటిలోగా https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రాసెస్ పూర్తి చేయాలని సూచించారు. నాన్ టీచింగ్ కేటగిరీలో ఈ పోస్టులు ఉన్నాయన్నారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్, డిప్యూటేషన్ ప్రాతిపదికన ఈపోస్టులను రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనిలో అత్యధికంగా ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. కొన్ని పోస్టులకు అయితే రూ. 500 నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అధికారిక వెబ్ సైట్ https://nitw.ac.in/careees/లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచారు.
…………………………………………………….