ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కల్తీమద్యం కేసులో మరో కీలక నేత అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు తెలిపిన వివరాల ప్రకారం.. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్(JOGI RAMESH)తో పాటు.. ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తరలించారు. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈ సందర్భంగా ఆరోపించారు జోగి రమేష్. మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిదగ్గర హైడ్రామా నెలకొంది. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిరసనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు (ADDEPALLI JANARDHANA RAO) పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఉదయం జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
