* వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్
ఆకేరు న్యూస్, వరంగల్: జర్నలిస్టులందరూ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం అధ్యక్షుడు కోరు కొప్పుల నరేందర్ అన్నారు. మంగళవారం వరంగల్ జర్నలిస్ట్ పరపతి సంఘం భవనంలో సంఘం ప్రధాన కార్యదర్శి బండి రవి అధ్యక్షతన జర్నలిస్టులకు పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ… నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉంటూ జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను పట్టించుకోవడం లేదన్నారు.. సమయానికి ఆహారం, నిద్ర లేకుండా గడుపుతున్నారన్నారు.ఈ మధ్యకాలంలో అనేక ఘటనలను చూస్తున్నామన్నారు. జర్నలిస్టులు మానసిక ఒత్తిడి కి లోనై అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొందరు ఈ మధ్యకాలంలో మృత్యు వాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు జర్నలిస్ట్ సంఘం ముందుకు వచ్చి సభ్యులందరికీ మనోధైర్యాన్ని కల్పించడంతోపాటు జర్నలిస్టు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఒక్కో సభ్యునికి రూ. 750 లతో 15 లక్షల రూపాయల విలువైన పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా వరంగల్ తూర్పు జర్నలిస్ట్ సంఘం ముందుకు సాగుతుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుల ఆధార అభిమానాలను చూర గొంటూ , అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల మధు, జన్ను స్వామి, వడిచెర్ల శ్రీనివాస్ , దుర్గాప్రసాద్, సీనియర్ జర్నలిస్టులో గాడిపెల్లి మధు, సంగోజు రవి, కంది భరత్, కందికొండ మోహన్, మన్నెం ఇంద్రారెడ్డి, దివ్వెల పూర్ణచందర్, భేతి ఉమాశంకర్, నిమ్మకాయల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………