Published:
* పోలింగ్ ముగిసే సమయానికి 47 . 1 శాతం నమోదు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : .జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి జూబ్లీహిల్స్లో 47.1 శాతం పోలింగ్ నమోదయింది. 2023 ఎన్నికల్లో కూడా 47 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం నియోజకవర్గం మొత్తంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.పోలింగ్ ముగిశాక ఈవీఎంలను యూసిఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్ర పరుస్తారు. కౌంటింగ్ 14 ఉదయం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వెలువడవచ్చని భావిస్తున్నారు.
…………………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
