
– దివ్యాంగులు, వృద్ధులకు కలెక్టర్ హరిచందన సూచన
– ప్రజావాణికి రాకుండా వెసులుబాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ కలెక్టరేట్ వరకు వచ్చి.. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు, వృద్ధులకు కలెక్టర్ హరిచందన (Collector Harichandhana) దాసరి వెసులుబాటు కల్పించారు. కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి రావాల్సిన అవసరం లేకుండానే.. తమ దరఖాస్తులను వాట్సాప్ ద్వారా పంపించవచ్చని సూచించారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తమ ఆర్జీల ను ఇప్పటినుంచి సెల్: 7416687878 నంబర్‌కు పంపిస్తే కలెక్టరేట్ సిబ్బంది వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పోర్టల్‌లో నమోదు చేసి ఐడీ కేటాయించి సమాచారం అందిస్తామన్నారు. ప్రతీ వారం గ్రీవెన్స్‌సెల్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanthreddy) సూచనల మేరకు ప్రజావాణిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్తగా వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
…………………………………………