
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రిటైర్డ్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని పేరును ఇండియా కూటమి ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జు ఖర్గే మంగళవారం ప్రకటించారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు బలపరచాయని ఖర్గే తెలిపారు. ఎన్డీఏ కూటమి తరపున అధికార పక్షం తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే ఈ నేపధ్యంలో ఇండియా కూటమి తపరపున దేశంలోని ప్రఖ్యాత న్యాయనిపుణుల్లో ఒకరైన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరునుఏ ఇండియా కూటమి ఖరారు చేసింది. తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. సుదర్శన్ రెడ్డి 1995 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టులో జీజేగా పనిచేశారు.2007 నుండి 2011 వరకు సుప్నీంకోర్టు జడ్జిగా సేవలందించారు. 2013లో గోవా లోకాయుక్తగా నియమితులయ్యారు. ఆ తరువాత ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.
………………………………………………….