
* మే 13తో పదవీ విరమణ చేయనున్న సంజీవ్ ఖన్నా
ఆకేరు న్యూస్, డెస్క్ : సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice B.R. Gavai) నియమితులయ్యారు. సీజేఐగా గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు 52వ సీజేఐగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ (CJI)జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం మే 13తో ముగియనుంది. దీంతో కొలీజియం తమ ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సుకు అనుగుణంగా కేంద్రం గవాయ్‌ను గవాయ్‌ను తదుపరి సీజేఐగా నియమించింది.
ఆరు నెలల పాటు సీజేఐగా కొనసాగనున్న గవాయ్
జస్టిస్ గవాయ్ ఆరు నెలల పాటు మాత్రమే సీజేఐగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీ విరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్నణ్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్ కావడం గమనార్హం. జస్టిస్ గవాయ్ మహారాష్ట్ర(Maharstra)లోని అమరావతికి చెందిన వారు 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అంచలంచెలుగా ఉన్నత బాధ్యతల్లో కొనసాగి, త్వరలో అత్యున్నత పదవిని అధిరోహించనున్నారు.
……………………………………