
* కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు బీసీలను మోసం చేశాయి
* తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు
ఆకేరున్యూస్ హైదరాబాద్ : కాంగ్రెస్ ( CONGRESS)పార్టీ ,బీఆర్ ఎస్ (BRS)లు బీసీలను మోసం చేశాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ( RAMCHANDER RAO )ఆరోపించారు. శుక్రవారం ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ (JUBLEEHILLS)ఉప ఎన్నికల నేపధ్యంలో నియోజకవర్గంలో చేయాల్సిన ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీల పట్ల ప్రజలు విసిగిపోయారని అన్నారు. గతంలో బీఆర్ ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చి దిద్దుతామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చిందన్నారు. ఏ ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ సారి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో గెలిచి ప్రధానికి బహుమతిగా ఇస్తామని రాంచందర్ రావు అన్నారు.
…………………………………………….