– గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్ (Justice Madan B Lokur as Chairman of Electricity Commission) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ నర్సింహారెడ్డి (Justice Narsimha Reddy) స్థానంలో ఆయనను నియమించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపున్నారు. గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా (Supreme Court judge) లోకూర్ పని చేశారు. 2011లో ఏపీ హైకోర్టు సీజే (AP High Court CJ) గా కూడా పనిచేశారు. ఈరోజు సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిన్నఅసెంబ్లీ (Assembly) లో ప్రకటించారు. కమిషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) సుప్రీంకోర్టుకు వెళ్లిన విదితమే. ఆయన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు తాజాగా జస్టిస్ మదన్ బీ లోకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
——————-