* ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము
* హాజరైన అతిరథ మహారథులు
* భారత న్యాయమూర్తి గా హరియాణ నుంచి తొలిసారి..
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice Of India) జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) జస్టిస్ సూర్యకాంత్ తో న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే 15 నెలల పాటూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, పియూష్ గోయల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా హరియాణకు చెందిన వ్యక్తి నియమితులు కావడం ఇదే తొలిసారి. ఓ మధ్య తరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించిన ఆయన.. అంచలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 15 నెలల పాటు సీజేఐగా కొనసాగనున్నారు.

…………………………………………………
