
* బినామీ పేర్లతో కోట్లు వెనకేసుకున్నారు
* మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
ఆకేరున్యూస్ డెస్క్ : మాజీ మంత్రి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ అవినీతి తిమింగలం అని బినామీ పేర్లతో కోట్ల ఆస్తులు సంపాదించారని స్టేషన్ ఘన్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. బిడ్డను రాజకీయ వారసురాలని చేసుకోవటం కోసమే కడియం అప్రూవర్ గా మారారని రాజయ్య విమర్శించారు. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఉంటే ఒక్కటైనా చూపించాలని సవాల్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కడియం శ్రీహరి తానే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.తన సొంత అభివృద్ధి తప్ప కడియంకు నియోజకవర్గ అభివృద్ధి అవసరం లేదని అన్నారు.రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఉందని ఉద్ఘాటించారు. కడియం శ్రీహరిని ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని అన్నారు. పార్టీ మారిన కడియం ఇప్పుడు సచ్చిన పాముతో సమానం అని రాజయ్య అన్నారు.
…………………………………