
* అభివృద్ధి సమావేశానికి హాజరు
* 6 సంవత్సరాల తరువాత అభివృద్ధి సమావేశం
* ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి , రేవూరి ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య హాజరు
* ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన ఎంపీ
* గుర్భిణులతో ముచ్చటించిన కావ్య
* ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ
ఆకేరు న్యూస్,హనుమకొండ : వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హనుమకొండలో ఉన్న ప్రసూతి ఆస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కయిటీ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.. ఎంపీ కావ్యతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్యసేవలు, గదులతోపాటు ల్యాబ్ లు, పలు విభాగాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐపీ, ఓపీ సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని ఆమె వైద్యులకు సూచించారు. గర్భిణులతో , బాలింతలతో ఆమె వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.6 సంవత్సరాల తరువాత మొదటిసారి కాంగ్రెస్ పాలనలోనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. అత్యవసర మందులు, బ్లడ్ హాస్పిటల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపర్చాలని, తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని తెలియజేసారు. పేషెంట్లకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో DMHO, ఆసుపత్రి సూపరిండెంట్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….