* స్పీకర్ ను గడువు కోరాను..
* మీడియాలో తోచినట్టు రాసుకుంటున్నారు.
* స్పష్టం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, వరంగల్ : నేను.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానా.. ఈ విషయం నాకు తెలియదు మరీ.. మీడియాలో ఈ మద్య తోచినట్టు రాసుకుంటున్నారు.. ఊహాత్మక కథనాలే ఎక్కువయినాయి.. కనీసం రాసే ముందు వివరణ తీసుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఈ రోజు శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిసి వివరణ ఇచ్చేందుకు మరి కొంత సమయం కావాలని అడిగాను.. అంతే తప్ప రాజీనామా చేసే ఆలోచన లేనే లేదు. ఇక పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే కనీస నైతిక అర్హత బీఆర్ ఎస్ పార్టీ నాయకులకు లేనే లేదని కడియం శ్రీహరి అన్నారు.
