Kakatiya Medical College ragging incident
* హాస్టల్ నుంచి బహిష్కరణ
* కాలేజీ నుంచి 3 నెలల సస్పెన్షన్
* విద్యార్థుల పై చర్యలకు అధికారుల సమాయత్తం
ఆకేరు న్యూస్, వరంగల్ : అధికారులు ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ రాగింగ్ భూతం విద్యార్థులను వదిలిపెట్టడం లేదు . వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థుల మద్య ఘర్షణ తలెత్తింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను మోకాళ్ళ పై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారని జూనియర్ విద్యార్థులు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్ విద్యార్థులపై చర్యలకు సిద్దమవుతున్నారు .
* వాట్సప్ చాటింగే గొడవకు కారణమా..!
రాగింగ్ అనగానే కొత్తగా కళాశాల విద్యార్థులు సీనియర్స్ మద్య ఉంటుందని అందరూ భావిస్తారు.. ఇక్కడ మాత్రం ఎంబీబీఎస్ రెండు, మూడవ సంవత్సరాలు చదువుతన్న విద్యార్థుల మద్య రాగింగ్ జరిగింది . రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల వాట్సప్ గ్రూప్ లో మూడవ సంవత్సరం విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్న సమాచారం అందుకున్నారు .. తమ గురించి జూనియర్స్ తప్పుగా మాట్లాడడం సరియైనది కాదు.. వారికి బుద్ది చెప్పి తీరాల్సిందే నని సీనియర్స్ నిర్ణయించుకున్నారు.. హాస్టల్ టెర్రస్ పైకి 20 మంది జూనియర్ మెడికోస్ ను పిలిచి మోకాళ్లపై కూర్చో బెట్టి తప్పయిందని..మరోసారి ఇలా చేయమని సారీ చెప్పించుకున్నారు.. ఇతరత్రా ఇబ్బంది పెట్టారని సమాచారం ..ఇది నచ్చని కొంతమంది జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మొదలు పెట్టి దేశంలో సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు.. వరంగల్ పోలీస్ కమిషనర్ కు కూడా బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు.. దీంతో కళాశాల అధికారులు రంగంలోకి దిగారు..

* *రాగింగ్ జరిగింది నిజమే..*
– అనితా రెడ్డి , కేఎంసీ యాంటి రాగింగ్ కమిటీ సభ్యురాలు.
అనురాగ్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సెక్రటరీ.ఫౌండర్ చైర్మన్..
అవును రాగింగ్ జరిగింది నిజమే..
కాకతీయ మెడికల్ కళాశాలలో రాగింగ్ ఆరోపణల ఫిర్యాదు మేరకు యాంటి రాగింగ్ కమిటీ సమావేశం జరిగింది..విద్యార్థుల మద్య సుహృధ్బావ వాతావరణం ఉండేలా చూడాలని కేఎంసీ ఆధికారులకు చెప్పాం .. రాగింగ్ చేసిన వారి మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయి..ఎలాంటి చర్యలు ఉంటాయని మాత్రం ఇపుడే చెప్పలేం
——————————————————————————————
