
* నేషనల్ పార్క్లో ఎదురు కాల్పులు
* మావోయిస్టునేత ,తెలంగాణ రాష్ట్రకమిటీ సభ్యుడు భాస్కర్ మృతి
ఆకేరు న్యూస్ డెస్క్ ః చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మళ్లీ కలకలం చోటుచేసుకుంది. రెండు రోజులుగా వరుసగా కొనసాగుతున్న కాల్పుల్లో మావోయిస్ట్ నేత తెలంగాణ రాష్ట్రకమిటీ సభ్యడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతిచెందారు. భాస్కర్ కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కమిటీ స్థాయికి భాస్కర్ ఎదిగారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల రిక్రూట్మెంట్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అతడి తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఏకే 47తోపాటు పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కేంద్రప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో వరుసగా కాల్పులు జరుగుతున్నాయి అందులో భాగంగా శుక్రవారం భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్ల భాస్కర్ మృతి చెందారు. భాస్కర్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోద్ మండలం లోని పొచర గ్రామం.
………………………………………………