* గద్వాల జిల్లా ధరూర్ మండలంలో కలకలం
* నెట్టెంపాడులో వీడియో వైరల్
ఆకేరు న్యూస్, గద్వాల : గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడులో మొసళ్ల సంచారం కలకలం కలిగించాయి.రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఉన్న కుంటలో గత సంవత్సర క్రితం ఒక మొసలి చొరబడగా ఇప్పుడు దానితోపాటు మరో రెండు మొసళ్లు తీవ్రంగా సంచరిస్తూ ఒడ్డుకు వస్తుండడంతో అటుగా వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పురుషులు బహిర్భూమికి వెళ్లే దారిలో మొసళ్లు సంచరిస్తుండడంతో తీవ్ర కలకలం రేపింది. ఆరు అడుగులకు పైగా ఉన్న మొసలి చేపను పట్టిన దృశ్యాలు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి మొసళ్లను బంధించాలని ప్రజలు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
