
ఆకేరు న్యూస్, ములుగు: కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్( స్థానిక సంస్థలు )సంపత్ రావు కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి నారాయణరావు తెలుగు సాహిత్యంలో, ప్రజా ఉద్యమాల్లో చేసిన కృషి విశేషమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజ్ కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మహేశ్ బాబు, ఇతర సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.
………………………………..