ఆకేరు న్యూస్ హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలోని పేదల ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చివేయడం అన్యాయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రూల్స్ ప్రకారం ఆదివారం కూల్చివేతలు చేయకూడదని కోర్టు చెప్పినా రేవంత్ సర్కార్ బేఖాతరు చేస్తోందని కవిత ఆరోపించారు. బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న పేదల ఇళ్లను ఒక్కసారిగా కూల్చివేశారని కవిత ఆరోపించారు. పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని కవిత ప్రశ్నించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని కవిత డిమాండ్ చేశారు.వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను కేటాయించాన్నారు. చుట్లూ కంచె వేసి ఉంటే ఈ భూములు కబ్జాకు గురయ్యేవి కావని కవిత అన్నారు.
4 వందల ఎకరాలు కబ్జా చేశారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత చాలా ప్రభుత్వాలు మారాయని ఏ ప్రభుత్వం కూడా ఈ భూములను కబ్జానుంచి కాపాలేక పోయిందని కవిత విమర్శించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధి కూడా 12 ఎకరాలు కబ్జా చేశారని మరి ఆయన కబ్జా చేసిన భూమిని వెనక్కి తీసుకుంటారా అని కవిత నిలదీశారు.ఈ సారి పేదల భూముల జోలికి వస్తే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతానని కవిత హెచ్చరించారు.
……………………………………………..
