
* ఎంపీగా ప్రమాణ స్వీకారం
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఎన్నికల్లో డీఎంకేతో మిత్రపక్షంగా ఉన్న మక్కల్ నీది మయ్యం పార్టీకి డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఓ రాజ్యసభ సీటును కేటాయించారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్,డీఎంకే,ఎంఎన్ ఎం పార్టీలు కలిసి పనిచేశాయి. ఇండియా కూటమి తరపున రాష్ట్రంలోని 39 లోకసభ స్థానాల్లో ఎంఎన్ ఎం పార్టీ ఇండియా కూటమి తరపున ప్రచారం చేసింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా కమల్ హాసన్ మీడియాతో తన అభిప్రాయిన్ని వ్యక్తం చేశారు.
………………………………………………..