
* తొక్కిసలాటలో 11 మంది మృతిపై విచారం
* ఎక్స్ వేదికగా సానుభూతి వ్యక్తం చేసిన కమల్
ఆకేరు న్యూస్ డెస్క్ ః థగ్ లైఫ్ ఫ్రీ ఈవెంట్ వేడుకల్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో అలజడి సృష్టించిన విషయం తెల్సిందే.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు కర్నాటకలో తీవ్ర దుమారం రేపాయి. కర్నాటక హై కోర్టు కూడా కమల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.. కమల్ వ్యాఖ్యలతో కర్నాటకలో కల్లోలం రేపి చర్చనీయాంశంగా మారిన నేపధ్యంలో చిన్నస్వామి స్టేడియం దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ జట్లు విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంపై కమల్ దిగ్భ్రాంతితో పాటు తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సానుభూతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.
………………………………………………