– ఇంటింటి ప్రచారం నిర్వహించిన పద్మశాలి సంఘ నేతలు, జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం
ఆకేరు న్యూస్, కమలాపూర్ : స్థానిక ఎన్నికల్లో పద్మశాలీలు అంతా ఐక్యతగా గెలుపుకు బాట వేయాలని, పద్మశాలి బలాన్ని సమాజానికి ఎలుగెత్తి చాటాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజు పల్లి, ఉప్పులపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో పద్మశాలి సంఘం కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్ప శివ శంకర్ ఆధ్వర్యంలో పద్మశాలి అభ్యర్థులు మిట్టపల్లి మహేశ్వరి కుమారస్వామి, గాజుల శ్రీనివాస్, మామిడాల కళ్యాణి అశోక్ ల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు పద్మశాలి సంఘం నేతలు. అనంతరం పద్మశాలి కులస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత ఉందన్నారు . ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, తవటం రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ, జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, మండల కార్యదర్శి మిట్టపల్లి ప్రభాకర్, మండల నాయకులు మెండు రమేష్, పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
………………………………………………..
