KamalaPur Inter Results Success
* రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఎం జె పి బాలికల కళాశాల విద్యార్థినులు
ఆకేరు న్యూస్ ,కమలాపూర్ :
నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కమలాపూర్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలు, కేజీబీవీ జూనియర్ కళాశాల లోనీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించి తమ సత్తా చాటారు.
*మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల కళాశాల (కమలాపూర్)
కళాశాలలో విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యధికంగా 94 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్ లో కే. వైష్ణవి (468/470), డి. సింధుప్రియ (468/470), ఎల్. భవాని (467/470), పి. మహర్షిత (466/470) రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్ లో ఎస్. మోహన (436/440), పి. శ్రీ లక్ష్మీ ప్రసన్న (436/440), ఎస్డీ సమరీన్ (434/440), బీ. స్పందన (434/440) మార్కులు సాధించారు.
సీనియర్ ఇంటర్ MPC లో కే. వర్షిత (991/1000), ఏం వెన్నెల (988/1000), జి. నోమిక (986/1000) మార్కులు సాధించగా సీనియర్ ఇంటర్ BiPC లో బి. రమ్య (987/1000), సిహెచ్. దివ్య (984/1000), బి. అఖిల (983/1000). మార్కులు సాధించారు
*మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర కళాశాల (కమలాపూర్)
కళాశాలలో సీనియర్ ఇంటర్ MPC లో డి. వినయ్ (MPC) 993/1000 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు 25 మంది విద్యార్థులు 450 పైచిలుకు మార్కులు సాధించారు. ఇదే ప్రాంగణంలో కొనసాగుతున్న మొగుళ్ళపల్లి గురుకుల కళాశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమని ప్రిన్సిపాల్ పి. కవితారెడ్డి పేర్కొన్నారు.
*కేజీబీవీ జూనియర్ కళాశాల (కమలాపూర్)
కేజీబీవీ విద్యార్థినులు కూడా అత్యుత్తమ మార్కులతో రాణించారు. సీనియర్ ఇంటర్ లో 84%, ఫస్ట్ ఇయర్ లో 87% ఉత్తీర్ణత నమోదైనట్లు స్పెషల్ ఆఫీసర్ కిే. అర్చన తెలిపారు. సీనియర్ ఇంటర్ MPC లో సిహెచ్. దివ్య (991), జి. సుష్మా ప్రియ (974), జి. అమూల్య (974) మార్కులు సాధించగా.. రెండవ సంవత్సరం ఇంటర్ బైపిసి లో కే. అక్షిత (959), జి. అక్షిత (946). మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో టీ. రేఖ (460/470), ఏ. ఐశ్వర్య (455/470) సాధించగా, బైపీసీలో జి. శ్రీవిద్య (413/440), ఏ. శ్రావ్య (403/440) మార్కులు సాధించారు.
కమలాపూర్ పరిధిలోని మూడు కళాశాలలు పోటీపడి అత్యుత్తమ ఫలితాలను సాధించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.
